Komatireddy Raj Gopal Reddy: పార్టీ మారుతున్నాని వస్తున్న వార్తలను బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నేను ఎక్కడ ఈ మాటలు అన లేదని క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రులు నన్ను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవమే అని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలవాలని లేదని సంచలన వ్యాఖ్యలు అన్నారు. కేంద్రంలో అధికారంలో లేకుండా, బలమైన నాయకత్వం లేకుండా. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలనే ఏకైక లక్ష్యంతో తాను బీజేపీలో చేరినట్టుగా చెప్పారు. అయితే..తాను కాంగ్రెస్ చేరతానని చెప్పకపోయినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తనకు అభిమానం ఉందని అన్నారు.
Read also: Esha Gupta : జర బట్టలేసుకో.. కుర్రాళ్లు చూస్తున్నారు
నన్ను రాజకీయంగా ఎదుర్కొలేక మునుగోడు ఎన్నికల సమయంలో 18 వేల కోట్లకు అమ్ముడుపోయానని రేవంత్ రెడ్డి, కేటీఆర్ దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో నాలుగు గ్రూపులు తయారయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలు జరగలేదు, ఫలితాలు రాలేదు అప్పుడే నాలుగు గ్రూపులు తమ నేత ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలుపెట్టాయని ఎద్దేవ చేశారు. నాకు పదవులు అవసరం లేదు. తెలంగాణ లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది, బీజేపీ పుంజుకుంటుంది. చేరికలు పెద్దఎత్తున ఉంటాయన్నారు. నాపై అపవాదులు, దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ లో పార్టీ బలోపేతం కోసం సునీల్ బన్సాల్ తో నిన్న రాత్రి గంటకు పైగా చర్చించానని అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారు. అధ్యక్ష పదవి కోసం ఎవ్వరూ లాబీయింగ్ చెయ్యడం లేదన్నారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి బండి సంజయ్‌ను అధిష్టానం కొనసాగిస్తుందని తెలిపారు. లేదంటే ఆయనకు వేరే భాధ్యతలు ఇస్తారు. అధిష్టాన నిర్ణయం ఫైనల్ అన్నారు. బీజేపీని బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. వారి కుట్రలు సాగవన్నారు.
Deepthi Sunaina: లేనిది కనిపించదు వున్నది పోదు.. ఎందుకమ్మ దీప్తి నీకా పోజులు