Bandi Sanjay: పులి వస్తోంది, వేట మొదలైంది.. బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Speech In Vijaya Sankalpa Sabha: ‘‘కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేను చెప్పింది ఒక్కటే.. మీరేం భయపడకండి, ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది, పులి వస్తోంది, వేట మొదలైంది, వెంటాడటం ప్రారంభించింది, అది కార్యకర్తల్ని కాపాడే పులి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేవెళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు తనను అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 8 గంటల పాటు రోడ్ల మీదే తిప్పారని గుర్తు చేశారు. అయితే.. కరీంనగర్ దాటిన తర్వాత తన భార్య ఫోన్ చేసిందని, ఢిల్లీ నుండి ఫోన్ చేశారని చెప్పిందని తెలిపారు. తనని కొత్తపేట, ప్రజ్ఞపూర్, భువనగిరికి తీసుకుపోయారని.. అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి ‘ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కావడం లేదని’ భయపడుతూ చెప్పాడని అన్నారు. అప్పుడు తాను ‘మీరేం భయపడకండని, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని, అక్కడి నుంచి పులి వస్తోందని, ఆ పులి వెంటాడటం ప్రారంభించిందని, ఆ పులే కార్యకర్తల్ని కాపాడుతుందని’ భరోసా ఇచ్చాడనని పేర్కొన్నారు.
Tarun Chugh: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే.. కేసీఆర్ సర్కార్ అడుగడుగునా అడ్డుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.. ఫసల్ బీమా అమలు చేస్తాం.. ఇళ్లను నిర్మిస్తామని, జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని.. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మాటిచ్చారు. తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని, కుటుంబ పాలనను, నియంత పాలనను కూకటి వేళ్లతో పెకిలించివేసేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చామని ఉద్ఘాటించారు. అందరి ఆశీస్సులు కావాలని కోరిన ఆయన.. లాఠీదెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతపెద్ద ఎత్తున సభకు తరలి వచ్చినందుకు అందరికీ చేతులెత్తి జోడించారు. కాగా.. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ & మధ్యప్రదేశ్ ఇంఛార్జీలు తరుణ్ చుగ్, మురళీధర్ రావు, సహఇంఛార్జీ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
Amit Shah: ప్రధాని కుర్చీ ఖాళీగా లేదు.. ముందు సీఎం సీటు కాపాడుకో..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..