కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపు కొరకు హుడా ట్రక్ పార్క్‌లో రేపు జరగబోయే విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి వెల్లడించారు.
యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
Bandi Sanjay: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో ఈ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నియోజకవర్గ నేతలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల ఈటెల రాజేందర్ తో పాటు మాజీ…
భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీతో నిర్వహించిన విజయ సంకల్ప సభ బాగా విజయవంతమైందని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. లక్షలాది మంది తరలిరావడం.. ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం.. ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. అయితే.. మరోవైపు సభ విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని…