దళితుల ముసుగులో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. తెలంగాణలో నాలుగవ విడత బండి సంజయ్ ప్రజాసంగ్రాయ యాత్ర కొనసాగుతోంది. కేపీహెచ్ బీ సమీపంలో పాదయాత్ర వద్ద భారీగా మొహరించారు పోలీసులు. పార్లమెంట్ భవన్ కు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ నినాదాలు చేశారు దళిత ఐక్యవేదిక సంఘాల నేతలు.
Read Also: Most millionaires in these cities: ప్రపంచంలో ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న నగరాలు ఇవే..
జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు బీజేపీ కార్యకర్తలు…దళిత ఐక్య వేదిక సంఘాల నేతలను గమనించి, తన వద్దకు పంపించాల్సిందిగా పోలీసులను కోరారు బండి సంజయ్. మాదాపూర్ డీసీపీ పర్యవేక్షణలో బండి సంజయ్ ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు దళిత సంఘాల నేతలు. దళిత ఐక్యవేదిక నేతలు అందించిన వినతి పత్రాన్ని స్వీకరించారు బండి సంజయ్. తప్పనిసరిగా కేంద్రానికి పంపాలని కోరారు దళిత ఐక్య వేదిక సంఘాల నేతలు.
ఇప్పటికే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న బండి సంజయ్, దళితుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చింది బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమేనని బండి సంజయ్ గుర్తుచేశారు. అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది నరేంద్రమోదీ ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. దళితుడిని రాష్ట్రపతి చేసిన ఏకైక పార్టీ బీజేపీయే అని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. జై భీమ్ అంటూ నినదించారు బండి సంజయ్. దీంతో సంతోషంగా బండి సంజయ్ పాదయాత్ర నుంచి వెనుదిరిగారు దళిత ఐక్య వేదిక సంఘాల నేతలు.
Read Also: Rashmika Mandanna: లోక్ సభ ఎంపీగా రష్మిక..?