రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ సీనియర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న క్రమంలో.. పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. ఇప్పుడు ఆరో విడత పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 16 నుంచి ఆరో విడత యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వద్ద రాష్ట్ర నాయకత్వం ప్రపోజల్ పెట్టింది. ఇప్పటికే ఐదు విడతల్లో 50పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్రను పూర్తి చేశారు. బండి సంజయ్ చేపట్టిన చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది ఇటీవల. భైంసా నుంచి ప్రారంభమైన ఐదవ విడత యాత్ర 8 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా 222 కిలోమీటర్లు సాగింది.
Also Read : Mamatha Mohan Das: ఆ తప్పు చేశా.. రాజమౌళి అన్న మాటతో గుండె పగిలింది
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలకు సంస్థాగతంగా బూత్ కమిటీల్లేవని.. సంస్థాగతంగా బలంగా లేని పార్టీలు సుధీర్ఘ కాలం మనుగడ సాధించలేవన్నారు. బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్నందునే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని చెప్పారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లో సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్నందున ఓటు బ్యాంకు పెంచుకుంటూ అధికారంలోకి ఉన్నామని అన్నారు. దేశంలోనూ రెండుసార్లు విజయం సాధించామని.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నామన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
Also Read : Clash With Cops: అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్ ముట్టడి