Bandi sanjay: అసోం సీఎంను మాట్లాడనీయకుండా మైక్ లాక్కోవడం హేయమైన చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణేశ్ ఉత్సవ కమిటీలో సీఎం కేసీఆర్‌ని విమర్శించినందుకు, నందుబిలాల్ వెనక నుంచి ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మైక్ లాక్కొని, ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే దీనిపై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మను స్టేజీపై మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోడం హేయమైన చర్య అని మండిపడ్డారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్ కు ముఖ్య అతిథిగా వచ్చిన అసోం సీఎంను గౌరవించాలనే కనీస సోయి లేకుండా టీఆర్‌ఎస్ నేతలు నీచంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.
మెడలో గులాబీ కండువా వేసుకున్న టీఆర్‌ఎస్ నేతలను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర సీఎంకి ఇచ్చే భద్రత ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కు కేంద్రం భద్రత కల్పించకపోతే ఆయన స్వేచ్ఛగా వెళ్లగలుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా? అని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది పాల్గొనే శోభాదయాత్రకు హాజరయ్యేందుకు అసోం నుండి వచ్చిన ముఖ్య అతిధి అడ్డుకుంటే పరువుపోతుందనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గు చేటన్నారు.
Also Read
భారతదేశంలోనే అతి తక్కువ కాలంలో అద్భుతమైన పాలనతో అసోం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న గొప్ప వ్యక్తి హిమంత బిశ్వశర్మ అని బండి సంజయ్ అన్నారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ.. ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలనా చేస్తున్న అసోం సీఎంని చూసి టీఆర్‌ఎస్ వాళ్లు నేర్చుకోవాలన్నారు. ఇక టీఆర్ఎస్ నాయకులను పంపించి అసోం ముఖ్యమంత్రిపై దాడి చేయించే కుట్రచేయడం సీఎం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సీఎం హిమంత బిశ్వశర్మపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టి.. ఈ దాడికి పురిగొల్పిన మంత్రులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్.. జాతీయ పార్టీ పెడుతానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. నగరంలో.. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులెవరూ పాల్గొనలేదన్నారు.
Saturday Venkateswara swamy Stothraparayanam Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..