Rythu Bandhu : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తీసుకొచ్చింది. నేడు వారి కోసం మరో రూ.550కోట్ల నిధులు విడుదల చేసింది. రైతు బంధు పథకంలో భాగంగా తెలంగాణ రైతులకు మంగళవారం మరో రూ.550.14 కోట్లు విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందోల్ మండలం దానంపల్లి వద్ద జైరాం రమేష్ మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే వందలమంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని చెప్పారు.
Telangana Highcourt : తెలంగాణ హైకోర్టు 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రకటించిన 2008 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలను ఇప్పటి వరకు భర్తీ కానీ 3500 పోస్టుల విషయంలో కీలక తీర్పు వెలువరించింది. అందులో భర్తీ చేయకుండా ఉన్న 1815 పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ సర్కారుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 14ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేకూరినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…
గణేశ్ ఉత్సవ కమిటీలో సీఎం కేసీఆర్‌ని విమర్శించినందుకు, నందుబిలాల్ వెనక నుంచి ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మైక్ లాక్కొని, ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే దీనిపై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మను స్టేజీపై మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోడం హేయమైన చర్య అని మండిపడ్డారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్ కు ముఖ్య అతిథిగా వచ్చిన…