Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రలో కలకలం.. తేనెటీగల దాడితో గందరగోళం.!
- అంజన్న ఆశీర్వాద యాత్రలో అనుకోని ఘటన
- డ్రోన్ తాకడంతో తేనెతుట్టె కూలి దాడి
- కార్యకర్తల్లో గందరగోళం, పలువురికి గాయాలు
- కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట భారీ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు జనం , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, రామడుగు మండలం వెదిర సమీపంలో ఒక చిన్న పొరపాటు కారణంగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర దృశ్యాలను ఆకాశం నుంచి చిత్రీకరించేందుకు ఉత్సాహంగా ఉన్న కొందరు కార్యకర్తలు డ్రోన్‌ను ఎగరేశారు. అయితే, ఆ డ్రోన్ నియంత్రణ తప్పి పక్కనే ఉన్న ఒక చెట్టుకు ఉన్న తేనెతుట్టెను బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు చెల్లాచెదురై పాదయాత్రలో ఉన్న వారిపై దాడి చేశాయి.
No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!
Also Read
తేనెటీగల దాడితో యాత్రలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పలువురు కార్యకర్తలకు తేనెటీగలు కుట్టడంతో వారు గాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి బండి సంజయ్ వెంటనే అప్రమత్తమయ్యారు. గాయపడ్డ కార్యకర్తలకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందేలా చూసి, తగిన వైద్య సహాయం చేయించారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఆయన తిరిగి తన యాత్రను ప్రారంభించారు. సాయంత్రం 6:30 గంటల కల్లా కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకునే లక్ష్యంతో బండి సంజయ్ తన పాదయాత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.
Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!
తాజావార్తలు
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!