Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2027: ఐపీఎల్ 2027కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ ట్రేడ్ చర్చలు జరుపుతున్నట్లు ప్రముఖ నివేదిక వెల్లడించింది. ఈ డీల్‌లో భాగంగా పంజాబ్ రెండు కీలక ఆటగాళ్లను ముంబైకి ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. అందిన నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్ సింగ్, విష్ణు వినోద్‌లను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అర్ష్‌దీప్ ఫాస్ట్ బౌలర్ కాగా, విష్ణు వినోద్ గతంలో ముంబై జట్టులో ఆడాడు.
పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఈ ట్రేడ్ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇరు జట్ల సీనియర్ మేనేజ్మెంట్లు ప్రతిపాదిత ఒప్పందానికి దాదాపు అంగీకరించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ఈ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు. హార్దిక్ పాండ్యా పంజాబ్ జట్టులోకి వస్తే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు డెత్ ఓవర్లలోనూ జట్టుకు బలం చేకూరుతుంది. అర్ష్‌దీప్‌ను కోల్పోవడం బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించుకునే వ్యూహంతో పంజాబ్ ముందుకెళ్లవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు నవంబర్ 17గా ఉండటంతో.. ఈ వారాంతంలోనే ట్రేడ్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ వార్తపై ఇరు ఫ్రాంచైజీల నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
Also Read
- Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
- Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
- Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
- Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!