AP Muncipal Counting: మున్సిపల్ కౌంటింగ్‌లో సత్తా చాటుతున్న కూటమి.. వైసీపీకి షాకిస్తున్న ట్రెండ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు , నగర పంచాయతీలకు సంబంధించి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్‌లో తొలి ట్రెండ్స్ నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు.
పోస్టల్ బ్యాలెట్ నుంచి వార్డుల వరకు కూటమి జోరు..
రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే కూటమి పార్టీలు తమ ఆధికారాన్ని చాటుకోవడం ప్రారంభించాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, విజయనగరం వంటి ప్రధాన కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా విశాఖ, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో టీడీపీ మేయర్ అభ్యర్థులు స్పష్టమైన లీడ్‌లో కొనసాగుతుండగా.. అమలాపురం, నర్సాపురం, తిరువూరు వంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు బలమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ మున్సిపాలిటీలు కూటమి కైవసం చేసుకోగా.. పుంగనూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది.
Also Read
- ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
- NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
- Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
- Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
వివిధ ప్రాంతాల్లో విజయాలు ఇలా..
కుప్పం మున్సిపాలిటీ: ప్రతిష్టాత్మక కుప్పం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతల మధ్య పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పెద్దాపురం అండ్ నర్సాపురం: పెద్దాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థులు వరుస వార్డులను కైవసం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. అలాగే నర్సాపురం మున్సిపాలిటీలో కూడా కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు.
మార్కాపురం అండ్ కళ్యాణదుర్గం: మార్కాపురంలో క్లీన్ స్లీప్ చేసే దిశగా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తుండగా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు భారీ సంఖ్యలో వార్డులను గెలుచుకున్నారు.
వైసీపీ పట్టు నిలుపుకునే ప్రయత్నం: నంద్యాల జిల్లా నందికొట్కూరు , కడప జిల్లా పులివెందుల వంటి కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు తమ సిట్టింగ్ స్థానాలను, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కొంత పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
తుఫాన్ ప్రభావం.. కౌంటింగ్‌లో జాప్యం..
‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాలైన రేపల్లె తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది రాక ఆలస్యం కావడం, స్ట్రాంగ్ రూమ్‌ల తాళాల కోసం స్వల్ప గందరగోళం నెలకొన్నప్పటికీ, ఎన్నికల అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కౌంటింగ్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
మధ్యాహ్నానికి పూర్తి స్థాయి కౌంటింగ్ ట్రెండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాత్రికి తుది ఫలితాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
-
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!