WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) గ్రూప్ చాట్స్‌లో 4 కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ముఖ్యమైన మెసేజ్‌లను ఎప్పటికీ (permanent) పిన్ చేసుకోవడం, గ్రూపులో కొత్తగా చేరిన వారికి పాత మెసేజ్‌లను షేర్ చేయడం, గ్రూప్ స్టేటస్ అప్డేట్స్, అన్‌రీడ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేయడం వంటి కీలక ఫీచర్స్ ను ఇకపై అందించనుంది.
వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లు ఇవే..
Also Read
- Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
- రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
- Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
పర్మనెంట్ మెసేజ్ పిన్:
ఇప్పటివరకు కేవలం నిర్ణీత సమయం వరకు మాత్రమే మెసేజ్‌లను పిన్ చేసే అవకాశం ఉండేది. ఇకపై ఎలాంటి కాలపరిమితి లేకుండా ముఖ్యమైన మెసేజ్‌లను పర్మనెంట్ గా పిన్ చేసుకోవచ్చు.
పాత మెసేజ్‌ల షేరింగ్:
గ్రూపులో కొత్తగా చేరిన సభ్యులకు ఇదివరకు జరిగిన సంభాషణలను కూడా షేర్ చేయవచ్చు. ఇందుకోసం ఆ సభ్యుడి పేరుపై క్లిక్ చేసి మెసేజ్ హిస్టరీని పంపే అవకాశం కల్పించింది. ఈ మెసేజ్‌లకు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుంది.
గ్రూప్ స్టేటస్ అప్డేట్స్:
కుటుంబం, స్నేహితులు లేదా ఇతర ప్రత్యేక గ్రూపులకు మాత్రమే స్టేటస్‌లను షేర్ చేయవచ్చు. గ్రూపులోని సభ్యులు వాటిని చూడటంతో పాటు రియాక్ట్ అవ్వొచ్చు. ఈ స్టేటస్లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి.
అన్‌రీడ్ మెసేజ్ ఫిల్టర్:
గ్రూపుల్లో తమను ట్యాగ్ చేసిన లేదా నేరుగా రిప్లై ఇచ్చిన మెసేజ్‌లను ప్రత్యేకంగా గుర్తించవచ్చు. @all ద్వారా వచ్చిన మెసేజ్‌లు కూడా ఈ ఫిల్టర్‌లో కనిపిస్తాయి.
వీటితో పాటు వాట్సాప్ ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్లను కూడా అప్డేట్ చేసింది. వ్యక్తిగతంగా రిప్లై ఇవ్వడం, పోల్స్‌లో ఒకే సమాధానాన్ని ఎంచుకునేలా పరిమితం చేయడం, గ్రూప్ సభ్యులకు వారి పాత్రలను తెలియజేసే మెంబర్ ట్యాగ్స్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్లు వాట్సాప్ యాప్ అప్డేట్ ద్వారా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటి పూర్తి రోల్అవుట్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కాబట్టి యూజర్లు తమ వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం స్వర కొత్త ఫీచర్స్ ను పొందవచ్చు.
తాజావార్తలు
-
November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Sarfaraz Khan: విదేశాల్లోనూ పరుగులు చేశా.. అయినా నాపై చిన్నచూపేనా..?
-
Hyundai Creta 2027: క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న నెక్స్ట్-జెన్ క్రెటా.. ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!