తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలంగాణప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం…
రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నిరసనకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా ఉన్న 317 జీఓను ఉపసంహరించుకునేలా రేపు రాత్రంతా కరీంనగర్‌లో జాగరణకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో రేపు (జనవరి 2) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు (జనవరి 3) ఉదయం 5 గంటల…
ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ప్రాంతవాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించింది.. స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోనుంది సర్కార్.. తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ స్థానికత.. స్పౌజ్ కేసులకు సంబంధించి సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేస్తోంది ఏపీ సర్కార్.. దీంతో.. సొంత ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్న ఉద్యోగులకు ఊరట దక్కనుంది. ఇక,…