బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 27వ రోజుకు చేరుకుంది.. ప్రజలను కలుస్తూ.. సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఇతర ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ ముందుకు సాగుతున్నారు బండి.. ఇక, ఇవాళ్టితో కామారెడ్డి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.. మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల గంభీరావు పేట మండలంలోకి అడుగుపెట్టనున్నారు.. నేటి నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 రోజుల పాటు కొనసాగనుంది ప్రజా సంగ్రామ యాత్ర.. సిరిసిల్ల జిల్లాలో…
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన.. గతంలో కాంగ్రెస్ కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలిస్తే.. ఇప్పుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు.. ఇక, బండి సంజయ్ తన పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర…
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌కి.. తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.. ఇక, కేసీఆర్.. ఒవైసీ సోదరుల మొప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆర్టికల్…