ఢిల్లీలో శాసన సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 19 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగిని విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఢిల్లీపీఠం కైవసం చేసుకునే దిశగా బీజేపీ సత్తా చాటుతోంది. 40 స్థానాల్లో లీడ్ సాధించింది. ఆప్ 20 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక హస్తం పార్టీ కనీసం పోటీలో లేకుండా పోయింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
Also Read: Milkipur Bypoll: అయోధ్యలో అప్పుడు ఓడింది.. ఇప్పుడు విజయం దిశగా బీజేపీ..
డిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని బండి సంజయ్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలన డిల్లీ ప్రజలు కోరుకున్నారని అన్నారు. అవినీతి,కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ఓటర్లు భావించారన్నారు. డిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని చెప్పారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాద్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో మీ సమస్యల గురించి ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే అని మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.