ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది. ఆప్ కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించటం.. ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. ఆప్ దిగ్గజాల్ని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు.. కాషాయ పార్టీకి రాచబాట వేశారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ.. ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు. మరిప్పుుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుందనేది చూడాల్సి ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 42 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్స్ వేస్తూ ఎక్స్ లో పోస్టు చేశాడు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. మరోసారి బీజేపీని గెలిపించిన…
ఢిల్లీలో శాసన సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 19 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగిని విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఢిల్లీపీఠం కైవసం చేసుకునే దిశగా బీజేపీ సత్తా చాటుతోంది. 40 స్థానాల్లో లీడ్ సాధించింది. ఆప్ 20 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక హస్తం పార్టీ కనీసం పోటీలో లేకుండా పోయింది. తాజాగా…
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నిలక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. నాలుగోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆప్, సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో పనిచేశాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు తేలనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ నిర్వహించనున్నారు.…