అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండిసంజయ్ లేఖ రాశారు. వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా మీ ప్రభుత్వం దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరించిందని అన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్…