Bandi Sanjay: స్వార్థం కోసం యాగం చేస్తే ఇంట్లో చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవ చేశారు. జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెల్లని రూపాయని అన్నారు. బీఆర్ యస్ పేరితో మరలా కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. సమైక్య నినాదాం తెచ్చి లబ్ది పొందాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రాజశ్యామల యాగం చేసినా ఏ దేవుడు క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం యాగం చేస్తే ఇంట్లో చేసుకోవాలని ఎద్దేవ చేశారు. ఢిల్లీలో యాగం చేసేటప్పుడు దేవుడి సాక్షిగా తెలంగాణలో ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read also: Aam Admi Party: గుజరాత్‌లో ఆప్‌కి మరో ఝలక్.. బీజేపీకి ఎమ్మెల్యే సపోర్ట్
కేసీఆర్ చేసే యాగాలు ఆయనకే తిప్పి కొడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. యాగం ద్వారా అయినా చెప్పు నీబిడ్డ (కవిత)కు లిక్కర్ స్కామ్ తో సంబంధము లేదని అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీబీఐ సాక్షి కోసం పిలిస్తే సింహాలు పులులు ఫ్లెక్సీలు ఏంటి? కార్యకర్తల సమీకరణ ఏంటి? అంటూ ప్రశ్నించారు. కవిత విచారణకు సహరికరించాలని మేము అంటున్నామని తెలిపారు. సీబీఐ ఇంట్లో కి కూడా వస్తుంది, దేశంలో ఏమి జరిగినా వస్తుందన్నారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభగా కరీంనగర్ లో భారీ బహిరంగ సభ పెడుతున్నామన్నారు. జేపీ నడ్డా ముఖ్య అతిధిగా పెద్ద ఎత్తున సభ జరుపుతామన్నారు బండి సంజయ్.
Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా లుక్ అవుట్