Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Function Hall Warns Uninvited Wedding Guests: కార్తీకమాసం వచ్చిందంటే చాలు, రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభకార్యాలతో సందడి వాతావరణం నెలకొంటుంది. పండుగ నెల కావడంతో వేడుకల హడావుడి ఓవైపు ఉంటే, విందు భోజనాల ఘుమఘుమలు మరోవైపు ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ సందడి మధ్య ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు, వేడుకలు జరిపే కుటుంబాలకు ‘పిలవని అతిథుల’ బెడద కొత్త తలనొప్పిగా మారుతోంది. ఎలాంటి ఆహ్వానం లేకుండానే వేడుకల్లో ప్రత్యక్షమవుతూ, దర్జాగా భోజనం చేసి వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండటంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి అనూహ్య పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. ఆహ్వానం లేని వ్యక్తులు ఫంక్షన్లకు హాజరై భోజనం చేస్తే ఇకపై ఊరుకునేది లేదని, నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ బోర్డుపై స్పష్టంగా హెచ్చరించింది. పాత ఐపీసీ సెక్షన్ 441 ప్రకారం, ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 329 కింద ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడు నెలల వరకు జైలు శిక్షతో పాటు రూ. 5 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.
Also Read
- Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో సిరా వివాదం.. బ్యాలెట్ బాక్సుల వద్ద కలకలం
- YSRCP Leader Arrest : వైసీపీ నేత అరెస్ట్.. పోలీసు వాహనంపైకెక్కి మహిళ నిరసన
- Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో అతిథుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ ఆహ్వానం లేనివారు గుంపులుగా చేరి భోజనాలు చేస్తుండటంతో, అసలైన బంధుమిత్రులు, ఆహ్వానితులకు భోజనం సరిపోని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి వంటకాలు తక్కువై నిర్వాహకులు అవమానకర స్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యను ముందుగానే నివారించేందుకు, వేడుకల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఫంక్షన్ హాల్ యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి కఠిన హెచ్చరిక బోర్డులను ప్రదర్శిస్తున్నాయి.
నిజానికి ఉచిత విందు కోసం పిలవకుండా వేడుకలకు వెళ్లే వ్యవహారం కొత్తదేమీ కాదు. గతంలోనూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి హెచ్చరిక ఫ్లెక్సీలు, బోర్డులు వెలిసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఆయా బోర్డుల ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పాటు నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు దారితీశాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ వేడుకల గౌరవాన్ని కాపాడే చర్యగా అభివర్ణించగా, మరికొందరు సరదా వ్యాఖ్యలతో స్పందించారు. ఏదేమైనా, ఆహ్వానం లేకుండా విందులకు వెళ్లే అలవాటున్న వారికి వనపర్తిలో ఏర్పాటు చేసిన ఈ హెచ్చరిక బోర్డు గట్టి సందేశాన్ని ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Hardik Pandya: ముంబై డిమాండ్లకు అంగీకరించని రాజస్థాన్.. హార్దిక్ విషయంలో అసలు ఏం జరిగిందంటే?
-
Netflix Pakistani content India: పాకిస్థానీ వెబ్ సిరీస్ వివాదం.. Netflixకు కేంద్రం కీలక సూచన!
-
India Playing 11: కొత్త ఆటగాడికి ఛాన్స్?.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!