India Economy Gen Z: భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు చూడని తరహా మార్పును చూస్తోంది. ఖర్చులు ఎలా చేయాలి..? ఎలా సేవ్ చేసుకోవాలి..? క్రెడిట్‌ను ఎలా వినియోగించాలి..? అనే దానిపై దేశ యువత తమదైన ముద్ర వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ మద్దతుతో పనిచేస్తున్న యువతకు అనుగుణమైన UPI ఫింటెక్ ప్లాట్‌ఫారమ్ సూపర్ మనీ (Super Money) విడుదల చేసిన తొలి వార్షిక వినియోగదారుల అధ్యయనం ‘superSpends 2025’ ఈ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది.…
జెన్-జెడ్ ఉద్యమంతో నేపాల్ అల్లకల్లోలం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో నేపాల్ రాజధాని ఖాట్మండు విధ్వంసానికి గురైంది. దేశంలో నాయకుల అవినీతి కారణంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో జెన్-జెడ్ ఉద్యమం పేరుతో యువత చెలరేగిపోయింది.
జెన్-జెడ్ ఉద్యమానికి తలొగ్గి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. రాజీనామా చేసి 24 గంటలు గడుస్తున్నా ఓలి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. ఆయనను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు ఏమైనా దాడి చేశారు.
నేపాల్‌ను ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కూడా కొనసాగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నాల్లో సహకరించాలని సైన్యం కోరింది.