దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న పార్టీ బీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ.. తెలంగాణను దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. ఇలాంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో మనం ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరు ఎడారిగా మారిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇక్కడ ఎంపీగా ఉన్న పాలమూరుకు చేసింది శూన్యమన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్ మాటలు మాటలుగానే ఉండిపోయాయన్నారు. పాలమూరు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రేపు జేపీ నడ్డా వస్తున్నారని,…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో దేవరకద్రలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలమూరు నుంచి వలసలు లేవని అంటున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. పాలమూరు నుంచి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, దమ్ముంటే తన…
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించారు. అయితే నేటి నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రెండో దశ ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అయితే నేడు డా. బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ, మోడీది అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితో…
రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్రను నేడు అలంపూర్ జోగులంబ నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రారంభించనున్నారు. అయితే నేడు డా.బీఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే తాను ప్రధాని అయ్యానని మోడీ చెప్పారన్నారు. అంబేద్కర్‌కి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని ఆయన కొనియాడారు.…
కరెంట్ చార్జీలు ఎప్పుడు తగ్గిస్తావో చెప్పు కేసీఆర్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మంగళవారం సీఎం కేసీఆర్ యాసంగి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కరెండు చార్జీల విషయమై ప్రతి ఇంటికి వెళ్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా సంవత్సరానికి పాతబస్తీ నుండి వేయి కోట్లు రావాలని ఆయన అన్నారు. మతతత్వ వాదివి నువ్వు.. అంటూ కేసీఆర్…
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని ఆయన విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. ఆనాడు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 14 తేదీన జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నుండి ప్రారంభిస్తున్నామన్నారు. సుమారు 311 కిలో…