బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలవి దొంగ ముఖాల, దొంగ మాటలు అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో లేకుండా హిందుత్వాన్ని రెచ్చగొట్టి వీడియో పెడుతున్నారని, బీజేపీకి పంజాబ్ లో డిపాజిట్ లేదన్నారు.వేరే ప్రాంతాల్లో సీట్లు తగ్గాయి అది గమనించాలని, శివాజీ విగ్రహం పెట్టడంనీ తప్పు పట్టడం లేదు, పెట్టీ ఆయన గురించి చరిత్ర చెప్పాలన్నారు. చరిత్ర హీనులు శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుతున్నారని, హిందూ ముస్లింలను సమానంగా చూసిన వ్యక్తి శివాజీ మహారాజ్ అని ఆయన అన్నారు. రైతు బంధు అందుకున్న ప్రతి రైతు ఉద్యమంలో పాల్గొనాలని, దేశంలో వరి కొనుగోలు చేయాలని ఆనవాయితీ ఉందన్నారు.
కానీ మోడీ ప్రభుత్వం యాసంగి పంటను కొనమంటున్నారని, మంత్రుల కమిటీ ఢిల్లీ వెళ్ళడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రులను కలుస్తున్నారని, ఈనెల 26న తీర్మానాలు చేస్తారన్నారు. సర్పంచ్ లు, జెడ్పీటీసీ లు ఈనెల 27న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తీర్మానాలు చేయాలన్నారు. 30న జిల్లా పరిషత్ లో ఏకగ్రీవ తీర్మానం చేయాలని, తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, చెరువులు, కుంటలు బాగు పడ్డాయన్నారు. పంజాబ్‌లో రెండు పంటలను కొనుగోలు చేస్తుందని, అలాగే తెలంగాణలో కొనాలని ఆయన డిమాండ్ చేశారు.