భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్-2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా జీవోలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎట్టకేలకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు అనుమతి లభించింది. సోమవారం ఆమె.. మంత్రి అతిషితో కలిసి తీహార్ జైలుకు వెళ్లారు. ఇద్దరు కలిసి సీఎం కేజ్రీవాల్‌ను కలవనున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎంట్రీ ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 1న ఆయన్ను అధికారులు జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.