వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ ఎదుట రఘురాం అనే పత్తి మిల్లు యజమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ.. పత్తి మిల్లు నడవాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదివరకు గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన స్పందించలేదని అన్నాడు. దిక్కుతోచని స్థితిలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వాపోయాడు.…