Jangaon: జనగాంలో దారుణం.. మైనర్ బాలికల శరీరంపై కారం చల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocity in Janagam: ఇంట్లో నుంచి నగదు దొంగలించారన్న కారణంతో ఇద్దరు బాలికలను ఓ ఇంటి యజమాని, ఆయన కుటుంబసభ్యులు చితకబాదిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈనెల 3 న ఈ సంఘటన జరిగితే మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Jailer: రజనీ ర్యాంపేజ్… 500 కోట్లు
Also Read
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
చెన్నూరులో మధుకర్ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే వారి ఇంట్లో ఇద్దరు అమ్మాయిలను పనిచేయడానికి పెట్టుకున్నారు. రోజు రావడం మధుకర్ ఇంట్లో పనిచేయడం వంటి పనులు చేసుకునేవారు. అయితే 15 రోజలు క్రితం యజమాని మధుకర్ ఇంట్లో రూ.35వేల వరకు డబ్బులు మాయమయ్యాయి. మధుకర్ ఇంట్లో వారు ఆ ఇద్దరి అమ్మాయిలను అడగ్గా డబ్బులు తీయలేదని సమాధానం ఇచ్చారు. అయితే తీవ్ర ఆగ్రహానికి గురైన యజమాని మధుకర్ ఆ ఇద్దరు మైనర్ బాలికపై పైశాచికంగా వ్యవహరించాడు. పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసి కళ్ళలో కారం పెట్టి దొంగతం చేశారంటూ వేధించారు. దీంతో వారు లేదు దొంగతనం చేయలేదని, ప్రాధేయపడ్డా కనికరించాలేదు యజమాని. పైగా పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసిన అందరూ చూస్తు ఉండిపోయారే తప్పా ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వారిద్దరి శరీరంపై కారం చల్లి చితకబాదారు. ఓ బాలిక తల్లిదండ్రులను సైతం తీవ్రంగా కొట్టారు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా సమాచారం మాత్రం తెలిసిందని సమాధానమిచ్చారు. కేసు నమోదు చేసుకున్నామని, దొంగతనం జరిగిందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే మరికొందరు మైనర్ బాలికలపై ఏంటీ ఈ అరాచకం అని మండిపడుతున్నారు. పోలీసులకు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మైనర్ బాలికలపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Instagram Reels: ఇన్‌స్టా రీల్స్ మోజు… బండరాళ్ల మధ్య చిక్కుకుని నరకం చూసిన యువకుడు
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!