సినిమాల పరిస్థితి ఒకప్పటిలా లేదు… అక్కడుంది సూపర్ స్టారా? మెగాస్టారా? అనేది చూడకుండా ఆడియన్స్.. కంటెంట్ ఉంటే చాలు, ఏ హీరో సినిమా పై అయినా కోట్ల వర్షం కురిపిస్తున్నారు. కంటెంట్ లేకపోతే రెండో రోజే థియేటర్ల నుంచి పంపిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీ సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ అది సూపర్ స్టార్ సినిమా అని హిట్ చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమా విషయంలోను అదే జరిగింది. నెగెటివ్ టాక్ వచ్చింది కాబట్టి భోళా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. జైలర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉండడంతో రజనీకి కూడా జైలర్ పై నమ్మకం లేదు కానీ సాలిడ్ కంటెంట్ పడితే… మౌత్ టాక్‌తోనే సినిమాలు హిట్ అవుతాయని జైలర్ ప్రూవ్ చేసింది. ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి… మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది.
పోయిన గురువారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… మంగళవారం వరకు మొత్తంగా ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. రోబో 2.O, పొన్నియన్ సెల్వన్, కబాలి, విక్రమ్ సినిమా తర్వాత ఐదో చిత్రంగా జైలర్ నిలిచింది. అంతేకాదు ఈ వీకెండ్ వరకు 500 కోట్ల మార్క్‌ని టచ్ చేయడం గ్యారేంటీ అని లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక తెలుగులో జైలర్ దెబ్బకు భోళా శంకర్ సినిమా మరింత వీక్ అయింది. కోట్ల షేర్ నుంచి లక్షల్లోకి పడిపోయినట్టుగా చెబుతున్నారు. జైలర్ మాత్రం కోట్లకు కోట్లు రాబడుతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు.