బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.
2021లో 141.09 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసిన కేంద్రం రూ 26 వేల కోట్లు రైతులకు కేంద్రం చెల్లించింది. అవినీతి విషయం లో కేంద్రం జీరో టాలరెన్సు తో ఉంది … కేంద్రం పై అవినీతి ఆరోపణల్లో నిజం లేదు, మోడీ చరిత్రలో అవినీతికి తావులేదన్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదనే పడుతుందన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రేషన్ షాప్స్ లో 2023 వరకు ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే.
2024 లో దేశం మొత్తం బహిరంగ మార్కెట్ లో కూడా ఫోర్టిఫైర్డ్ రైస్ అందుబాటులోకి తెస్తాం. తెలంగాణలో 25 రైస్ మిల్స్ తమ మిషనరీని అప్ గ్రేడ్ చేసుకున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మిగతా రైస్ మిల్స్ కూడా అప్ గ్రేడ్ కానున్నాయన్నారు. ఆహార భద్రత పక్కాగా అమలు చేస్తున్నాం.. ఐ.సీడీఎస్ అంగన్ వాడీల ద్వారా పిల్లలకు, గర్భవతులకు పోషకాహారం అందజేస్తున్నాం అన్నారు.
గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అనీ, 2070 వరకు కార్బన్ ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకువస్తాం అన్నారు అశ్వినీ కుమార్. తెలంగాణలో హైద్రాబాద్ తో సహా నాలుగు పట్టణాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ గా ఉంది. పరిశ్రమల వ్యర్ధాలను మూసీ, హుస్సేన్ సాగర్ లోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయన్నారు. మూసీ, హుస్సేన్ సాగర్ లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటి ప్రక్షాళనకి కృషి చేస్తాం అన్నారు. హైదరాబాద్, నల్గొండ, పటంచేరు, సంగారెడ్డి ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు దృష్టి పెట్టాం. తెలంగాణ రైతులకు సోలార్ పంప్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదని విమర్శించారు.