బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.…