Loan App Harassment: దీపావళి పండుగ రోజు ఓ కుటుంబంలో విషాదం జరిగింది. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఈఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకుంది. కొత్తకోటలో నివాసం ఉంటున్న శేఖర్ కొద్దిరోజుల క్రితం లోన్ యాప్ ద్వారా డబ్బులు అప్పుగా తీసుకున్నారు. డబ్బులు వాయిదాల పద్దతిలో చెల్లించే క్రమంలో కొంత ఆలస్యం అయ్యింది.
Read also: Air Quality : కాలుష్య కోరల్లో భారత్.. టాప్ టెన్‌లో 8నగరాలు
దీంతో.. లోన్ యాప్ వేధింపులు మొదలయ్యాయి. రుణం ఇవ్వాలంటూ ఫోన్ లు చేసి వేధించేవారు. డబ్బులు చెల్లించాలంటూ అరాచకం సృష్టించారు. కుటుంబసభ్యులకు, స్నేహితులకు నగ్న దృశ్యాలు పంపి వేధింపులకు పాల్పడ్డారు. దీంతో శేఖర్ మనస్థాపంతో కుంగిపోయాడు. అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపావళి రోజు వెలుగులు నింపాల్సిన కుటుంబంలో శేఖర్ ఆత్మహత్య చేసుకోవడంతో విషాధఛాయలు అలుముకున్నాయి.
Ahimsa: ‘అహింస’కు మసాలా అద్దిన డైరెక్టర్ తేజ.. అదిరిపోయిందిగా