Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తన మేనల్లుడితో రోడ్లపై షికారు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై ఫైర్ జరిపిన సంజయ్.. మే 13న పోలింగ్ ముగియడంతో రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. అంతేకాదు ఎన్నికల ఫలితాల వెల్లడికి దాదాపు 20 రోజుల సమయం ఉండడంతో.. వారు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి ప్రయత్నిస్తున్నారు. అంచక్క తన మేనల్లుడు శ్రీనిక్ బాబుతో కలిసి బండిపై ఎక్కి బయటకు వచ్చి సరదాగా గడిపారు. స్కూటీపై సరదాగా కరీంనగర్ వీధుల్లో తిరిగారు. అయితే బండి సంజయ్ ను చూసిన జనం ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే ఒక లీడర్ ఇలా సామాన్యులా ప్రజల్లో ఒకరై కలిసి తిరుగుతూ ఓ బేకరీకి వెళ్లి ఐస్ క్రీం, సమోసా తినడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Read also: Sonakshi Sinha: హీరోయిన్స్ విషయంలోనే దర్శకనిర్మాతలు అలా ఎందుకు అడుగుతారో: సోనాక్షి
అయితే బేకరి యాజమాన్యం బండి సంజయ్ ను చూసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్కూటీపై ఇంటికి తిరిగి వచ్చారు. కరీంనగర్ వీధుల్లో స్కూటీపై తిరుగుతున్న బండి సంజయ్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఎన్నికల ముందు ప్రచారంలో ఒక నేతగా చూసిన వారంతా.. ఇప్పుడు బండి సంజయ్‌ని ఇలా చూసి ఆశ్చర్యపోతున్నారు. మనవడితో బండిపై వెలుతుంటే అందరూ సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మరొకొందరైతే నిజంగానే బండి సంజయ్ ఇలా షెక్యూరిటీ లేకుండా ప్రజల్లో ఒకరిలా భలే తిరుగుతున్నారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత తాను మళ్లీ పార్లమెంటుకు ఎన్నికవుతానన్న విశ్వాసం బండిసంజయ్ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Kalki 2898 AD : ప్రభాస్ “కల్కి” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?