Nora Fatehi: ఘరానా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ సూత్రధారిగా భావిస్తున్న రూ.200 కోట్ల కుంభకోణంలో నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆమె టీమ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ చుట్టూ జరిగిన కుట్రలో నోరా ప్రమేయం లేదని, క్రైమ్ సిండికేట్ గురించి ఆమెకు తెలియదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
సుకేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసులు గురువారం ఆరు గంటలకు పైగా ప్రశ్నించారు. ఇదే కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఇది వచ్చింది. నోరాకు ఈ కేసుతో సంబంధం లేదని, నిందితుడి వ్యవహారాలపై అనుమానం రాగానే ఆమె ఈ విషయాలను తమతో పంచుకోగా నోరా చర్యలకు అనుగుణంగా దర్యాప్తు సాగించామని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు నటి బృందం తెలిపింది. సుకేష్ చంద్రశేఖర్ భార్యకు చెన్నైలో స్టూడియో ఉంది. నోరాను దాని ఫంక్షన్ కోసం పిలిచారు. రుసుము తీసుకోవద్దని, బదులుగా ఆమెకు కారు బహుమతిగా ఇస్తున్నారని చెప్పారు. సుకేష్ పదే పదే ఫోన్ చేసి బ్లాక్ చేయడంతో నోరాకు అనుమానం వచ్చింది. నోరా తన వ్యవహారాల్లో కచ్చితంగా ప్రొఫెషనల్‌గా ఉండేదని ఆమె బృందం వెల్లడించింది.
Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..
గురువారం, నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మందిర్ మార్గ్ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించింది. ఆమె కమ్యూనికేషన్, సంభాషణల స్క్రీన్‌షాట్‌లతో సహా తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాలను పంచుకుంది. సాక్షులు సమర్పించిన సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లనున్నారు. నోరా ఫతేహి తాను సుకేష్‌ను లేదా పింకీని ఎప్పుడూ కలవలేదని అధికారులకు చెప్పింది. వాట్సాప్ ద్వారా సుకేష్ చంద్రశేఖర్‌తో టచ్‌లో ఉన్నట్లు ఆమె ఈఓడబ్ల్యూ అధికారులకు చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, నోరా బావమరిది బాబీ తనకు సుకేష్ చంద్రశేఖర్ రూ. 65 లక్షల విలువైన బీఎమ్‌డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారని అంగీకరించినట్లు సమాచారం.