Revanth Reddy: నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాల మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్,మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ‘ఆరు హామీల’ చట్టానికి సంబంధించిన ఫైలుపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. అలాగే రజనీ అనే వికలాంగ మహిళకు తొలి ఉద్యోగం ఇచ్చిన ఫైల్‌పై సంతకం చేయనున్నారు.
Read also: Revanth Reddy: నేడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డిని నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కాంగ్రెస్ నేతలు అందజేశారు. ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ పరంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానాలు పంపారు. వీరిలో మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఏపీ, తమిళనాడు సీఎంలు జగన్, స్టాలిన్ తదితరులున్నారు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా తెలంగాణ క్యాబినెట్ లో నేడు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ,శ్రీధర్ బాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు ,సీతక్క ,కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మరో 10 మంది మంత్రులు ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని అంటున్నారు.
Read also: Off The Record: ఆరు ఎమ్మెల్సీ సీట్లకు ఎంతమంది పోటీ..? కాంగ్రెస్‌కు దక్కేవి ఎన్ని? డిమాండ్ ఎంత?
మరోవైపు రేవంత్ రెడ్డి బుధవారం రోజంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితరులతో రేవంత్ సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి వీరికి ఆహ్వానం అందింది. భారత కూటమి సభ్యులతో పాటు వివిధ పార్టీల నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. లోక్ సభ స్పీకర్ ఒంబిర్లాను మర్యాదపూర్వకంగా కలుసుకుని సభలో కాసేపు గడిపారు. అనంతరం వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. వారంతా ఆయనకు అభినందనలు తెలిపారు.
Astrology: డిసెంబర్ 07, సోమవారం దినఫలాలు