‘ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్ వేదికగా చిరంజీవి ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరి ఆశీ స్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు ఉన్నారు.
దీనిపై సాయి ధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం” అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. కాగా కొన్ని రోజుల ముందు హైటెక్ సిటీ దగ్గర జరిగిన బైక్ యాక్సిడెంట్‌కు గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడ్డాడు. శస్ర్త చికిత్సల అనంతరం పూర్తి ఆరోగ్యం తో కోలుకుని తొలిసారి ఫ్యామిలీ ఫంక్షన్‌లో అందరూ మెగా హిరోలను కలుసుకున్నాడు.
నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం.🙏🏼 https://t.co/2de1Ob2JgC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 5, 2021