Health Department: అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. వైద్య సిబ్బంది సెలవులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విభాగాల అధిపతుల దగ్గర నుంచి మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలని తెలిపారు. ఈనెల 20 నుంచి 26 వరకు అన్ని జిల్లాలో 327 మందిని, ఇవాళ 176 మందిని.. మొత్తంగా 503 మందిని హాస్పటల్లోని బర్త్ వెయిటింగ్ రూములకు సురక్షితంగా తరలించామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ తో నటించడం ఆనందంగా ఉందా.. ఏమన్నావో అర్ధమవుతుందా.. ?
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
గర్భిణుల వెంట వచ్చిన వారికి వసతితో పాటు భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈవిధంగా ముందస్తు చర్యలు తీసుకుంటూ గర్భిణుల సంరక్షణకు వైద్యారోగ్య శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది అని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్ లోని ప్రధాన ఆస్పత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉన్నారు అని ఆయన తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు.. జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వైద్యారోగ్య మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు.
Read Also: AP DGP Rajendranath Reddy: బాలికలు, మహిళల అదృశ్యం నిజమే.. కానీ..
ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో 24×7 స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది.. పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తుందని మంత్రి వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డీపీహెచ్ పరిధిలోని సిబ్బందికి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన వారికి కూడా రద్దు చేసి, తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!