AIMIM: ‘‘ఎన్‌కౌంటర్లు చేసే వారిని ఎన్‌కౌంటర్ చేస్తాం’’.. ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- మాకు 11 మందిని ఇస్తే చాలు..
- ఎన్‌కౌంటర్లు చేసే వారిని ఎన్‌కౌంటర్లు చేస్తాం..
- యూపీలో ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIMIM: ఉత్తర్ ప్రదేశ్ మీరట్ సభలో ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ చేసిన వ్యాఖ్యలు యూపీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌కౌంటర్లు, ‘బుల్డోజర్ యాక్షన్’ జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. యోగి సర్కార్‌పై, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సోమవారం మీరట్‌లో జరిగిన ‘‘ఈద్ మిలన్’’ కార్యాక్రమంలో ఈ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Crime: మత్తుమందు ఇచ్చి మహిళపై డాక్టర్ అఘాయిత్యం..
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
రాష్ట్రంలోని ప్రజలు తమకు 111 మందిని కాకుండా, కేవలం 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే చాలని, రాష్ట్రంలో ఏ ఒక్క ముస్లిం కూడా ఎన్‌కౌంటర్ బారిన పడకుండా తాము చూసుకుంటామని కామెంట్స్ చేశారు. ఏ ముస్లిం అయినా ఎన్‌కౌంటర్లలో చంపబడితే, ఆ ఎన్‌కౌంటర్ కు బాధ్యులైన వారే స్వయంగా ఎన్‌కౌంటర్ ఎదుర్కోవాల్సి వస్తుందని షౌకత్ అలీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఎంఐఎం నేత చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మరోవైపు, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ.. ఏ పార్టీకైతే 111 ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో వారు ఈ రోజు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. కేవలం ఆరోపణల ఆధారంగానే రాష్ట్రంలో ఇళ్లను కూల్చివేస్తున్నారని, ప్రజలపై కాల్పులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనే ప్రయత్నంలో ఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!