IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఓ మార్పు చేసినట్లు గిల్ తెలిపాడు. తెలుగు ప్లేయర్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి విశ్రాంతి కల్పించి.. యువ ఆటగాడు అకీబ్ నబీకి ఛాన్స్ ఇచ్చారు. దేశవాళీల్లో సత్తాచాటిన నబీ.. తొలిసారి వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను సమం చేయాలంటే వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.
టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ వికెట్‌పై కాస్త ఎక్కువగా పచ్చిక ఉందని, కొన్ని ప్రాంతాల్లో ప్యాచీగా కనిపిస్తోందని చెప్పాడు. ఆరంభంలో పేసర్లకు కొంత అదనపు సహకారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. గువాహటిలో వేడి, తేమ ఎక్కువగా ఉండటంతో తమ ఫాస్ట్ బౌలర్లకు ఇది మంచి సవాల్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. తొలి వన్డేలో మొదటి 20-25 ఓవర్లలో భారత్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆ తర్వాత జట్టు అద్భుతంగా పుంజుకుందని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో ఫీల్డింగ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. గత మ్యాచ్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయని, ఈ మ్యాచ్‌లో వాటిని సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు.
Also Read
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
- IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
తొలి వన్డేలో భారత టాప్ ఆర్డర్ మొత్తం మంచి ఫామ్‌లో కనిపించిందని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. రోహిత్ శర్మ కూడా మంచి టచ్‌లో ఉన్నాడన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్ల నుంచి మంచి ప్రదర్శన వస్తుందని గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను సమం చేయాలంటే వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ.
వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, కీసీ కార్తీ, షాయ్ హోప్ (కెప్టెన్), అమీర్ జాంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, విటెల్ లావ్స్.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..