Aadi Srinivas : హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..
- టిమ్స్ హాస్పిటల్ పనులపై హరీష్ రావుపై ఆరోపణలు
- సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో ఆస్పత్రుల నిర్మాణం వేగవంతం
- ఉస్మానియా, ఎంజిఎం ఆస్పత్రులపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
- జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ నేతలను పట్టించుకోరని ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : జూబ్లీహిల్స్ ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చర్యలపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.. “పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలి. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్ కోసం టెండర్లు పిలిచారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి” అని అన్నారు.
Shubman Gill : రోహిత్ శర్మకు షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం విషయంలో హరీష్ రావు ఆరోపణలు నిజం కాదని ఆయన తేల్చారు. “విదేశాల నుంచి ఆధునిక వైద్య పరికరాలు రావాల్సి ఉండటంతో కొంత సమయం పడుతోంది. కానీ పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని మాకు ఉద్దేశం లేదు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతోనే ప్రజలకు అందించబోతున్నాం” అని వివరించారు. “ఉస్మానియా వర్షాల్లో మునిగిపోయినా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కానీ మా సీఎం గోషామహల్లో ఆధునిక సౌకర్యాలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే పనులు మొదలుపెట్టింది” అని చెప్పారు.
అలాగే వరంగల్‌లో ఎంజిఎం ఆస్పత్రి నిర్మాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. “త్వరలోనే ఆ ఆస్పత్రిని కూడా ప్రారంభించబోతున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కోట్లాది రూపాయలను పేదలకు అందిస్తున్నాం” అని గుర్తు చేశారు. “పదేళ్ల పాటు ప్రభుత్వాస్పత్రులను గాలికి వదిలేసి ఇప్పుడు మాకు పాఠాలు చెబుతున్నారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు హరీష్ రావు, కేటీఆర్‌లను పట్టించుకోరు” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!