Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Grow Rose Plant from Cuttings at Home: మీరు కూడా మీ ఇంట్లో చక్కటి గులాబీ మొక్కను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య సమయం గులాబీ మొక్కలు నాటడానికి చాలా అనుకూలమైనది. దీని కోసం ప్రతిసారీ నర్సరీకి వెళ్లి కొత్త మొక్క కొనాల్సిన పనిలేదు. మీ ఇంట్లోగానీ, పొరుగువారి వద్ద లేదా స్నేహితుల ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన గులాబీ మొక్క నుంచి ఒక చిన్న కొమ్మను కట్ చేసి తెచ్చుకుంటే చాలు, ఇంట్లోనే సులభంగా కొత్త మొక్కను తయారు చేసుకోవచ్చు. విశేషమేమిటంటే.. కొమ్మ ద్వారా కొత్త గులాబీ మొక్కను పెంచడానికి ఎలాంటి ఖరీదైన వస్తువులు లేదా ప్రత్యేకమైన యంత్రాలు అవసరం లేదు. సరైన కొమ్మను ఎంచుకోవడం నుంచి దానిని మట్టిలో నాటడం, నీరు పోయడం, ఎండ తగిలేలా చూసుకోవడం వరకు కొన్ని చిన్న చిన్న విషయాలు పాటిస్తే సరిపోతుంది. మీ బాల్కనీని లేదా మేడపైన ఉన్న చిన్న తోటను అందమైన గులాబీ పూలతో అలంకరించుకోవాలనుకుంటే ఈ చిట్కా మీకు బాగా ఉపయోగపడుతుంది. సరిగ్గా నాటిన కొమ్మ కొద్ది రోజుల్లోనే వేర్లు తొడిగి కొత్త గులాబీ మొక్కగా మారుతుంది.
గులాబీ కొమ్మ నుంచి కొత్త మొక్కను తయారు చేయడంలో అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు సరైన కొమ్మను ఎంచుకోవడం. దీని కోసం దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉన్న పచ్చని, ఆరోగ్యకరమైన కొమ్మను తీసుకోవాలి. ఆ కొమ్మ మరీ లేతగా ఉండకూడదు, అలాగని బాగా ముదిరిపోయి గట్టిగా కూడా ఉండకూడదు. కొమ్మపై ఎలాంటి పురుగులు లేదా రోగాలు లేకుండా జాగ్రత్తలు పడాలి. బాగా పాతబడిన లేదా బలహీనమైన కొమ్మలను ఉపయోగిస్తే మొక్క మొలకెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరైన కొమ్మను ఎంచుకున్న తర్వాత, దాని కింద భాగంలో ఉన్న ఆకులన్నింటినీ తీసేసి, పైన కేవలం రెండు మూడు ఆకులను మాత్రమే ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొమ్మలోని శక్తి అంతా ఆకులపై కాకుండా వేగంగా వేర్లు రావడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కొమ్మ కింది భాగాన్ని శుభ్రమైన చాకు లేదా కత్తెరతో కాస్త క్రాస్‌గా (వాలుగా) కట్ చేయాలి. ఇలా చేయడానికి శుభ్రమైన పరికరాలను వాడితే కొమ్మకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి.
Also Read
- Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Tilak Varma: "ఇది కదా తెలుగోడి పవర్".. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ఇక మట్టి విషయానికి వస్తే, గులాబీ కొమ్మ నాటడానికి తేలికగా ఉంటూ, నీరు నిలిచిపోకుండా బయటకు పోయేలా ఉండే మట్టిని ఎంచుకోవాలి. మామూలు మట్టిలో కొద్దిగా ఇసుక, కోకోపీట్ కలిపి వాడుకుంటే ఇంకా మంచిది. ఈ మట్టి మిశ్రమాన్ని ఒక చిన్న కుండీలో నింపి, మధ్యలో వేలితో లేదా చిన్న పుల్లతో రంధ్రం చేసి, సిద్ధం చేసుకున్న కొమ్మను జాగ్రత్తగా నాటాలి. కొమ్మ చుట్టూ ఉన్న మట్టిని చేత్తో తేలికగా నొక్కి స్థిరపరచాలి. నీరు కిందకి పోవడానికి కుండీ అడుగున రంధ్రాలు ఉన్నాయో లేదో చూసుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఎక్కువ నీరు నిలిచిపోతే కొమ్మ కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కొమ్మ నాటిన తర్వాత మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి తప్ప ప్రతిరోజూ ఎక్కువగా నీరు పోయకూడదు. మట్టి కాస్త ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే అవసరానికి తగినట్లు నీళ్లు చల్లాలి. మొదట్లో ఈ కుండీని నేరుగా ప్రచండమైన ఎండ తగలకుండా, కాస్త వెలుతురు ఉండే నీడ ప్రాంతంలో ఉంచాలి. కొమ్మ చుట్టూ తేమ శాతాన్ని కాపాడటానికి కుండీపై ప్లాస్టిక్ కవర్ లేదా కట్ చేసిన పారదర్శక ప్లాస్టిక్ బాటిల్‌ను బోర్లించవచ్చు. ఇలా సరైన కొమ్మను ఎంచుకుని, తగినంత తేమ, వాతావరణం అందిస్తే దాదాపు 3 నుంచి 4 వారాల్లో వేర్లు రావడం మొదలవుతుంది. అయితే వాతావరణం, కొమ్మ స్వభావం, మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఈ సమయం కాస్త అటుఇటుగా మారవచ్చు. నాటిన కొమ్మ నుంచి కొత్త ఆకులు రావడం ప్రారంభమై, మొక్క బాగా వేర్లు పట్టుకున్నాక, దాన్ని నిదానంగా పెద్ద కుండీలోకి మార్చుకోవచ్చు. సాధారణంగా మొక్క బాగా బలంగా తయారవ్వడానికి 1 నుంచి 2 నెలల సమయం పడుతుంది.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!