చిన్న చిన్న వివాదాలు పెద్దవై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న వైనం. భార్య భర్తల విషయంలో నువ్వా నేనా అంటూ ఒకరినొకరు తగ్గకుండా నాదే పైచేయి వుండాలనే అహంకారం, అహంభావంతో.. ఎదుటి వారు మనస్తాపానికి గురై ప్రాణాలమీదికి తెచ్చుకునే పరిస్థితి తెలెత్తుతోంది. తన భార్య ఇంటికి రానందుకు ఓ భర్త ఫోన్ చేసి లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలో చోటుచేసుకుంది.
నగరంలోని తుక్కుగూడలో సాయి కార్తిక్‌గౌడ్, భార్యతో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి కందుకూరు మండలం బేగంపేట వెళ్లాడు. అయితే.. భార్య కొద్ది రోజులు పుట్టింట్లోనే వుంటా అనడంతో.. భార్యను అక్కడే వదిలి కార్తిక్‌గౌడ్ శనివారం ఇంటికి వచ్చాడు. నిన్న ఆదివారం మీర్‌పేటలో జరిగే బోనాల పండగకి తన పిన్ని ఇంటికి వెళదామని భార్యకు పదే పదే ఫోన్ చేశాడు కార్తిక్. భార్య స్పందించలేదు. తను ఫోన్ చేసిన ఆవిషయాన్ని తేలికగా తీసుకుందన్నారు. భర్త కార్తిక్‌గౌడ్ తీవ్ర మనస్తాపంతో కార్తిక్ రవళికి వీడియో కాల్ చేసాడు. ఫోన్ లో మాట్లాడుతూ.. మీ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర విందులకు నేను హాజరవుతున్నా.. తమ వాళ్ల వద్దకు నీవెందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నాపరువు పోయిందంటూ లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ దూలానికి ఉరేసుకున్నాడు. భర్త ఫోన్ పడేయడంతో.. దృశ్యాలు కానరాలేదని తెలిపారు. భార్య రవళి వెంటనే భర్త వద్దకు బయలుదేరి పక్కింటి వాళకు ఫోన్లు చేస్తూ భర్తను కాపాడాలని వేడుకుంది. పక్కింటి వాళ్లు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. భార్య ఇంటికి చేరుకునేప్పటికే భర్త మృతి చెందాడు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పహాడీషరీఫ్ సీఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు.
Salaar: వచ్చేసింది.. వచ్చేసింది.. ‘సలార్’ అప్డేట్ ఇదే