వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి మోజులో భర్తను, సంసారాన్ని నిప్పుల కుంపటిలా చేసుకుంటున్నారు. వాటికి దూరమై నరకయాతనకు దగ్గరవుతున్నారు. ఇలాంటి ఘటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ సైనికుడి భార్యతో రాసలీలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ప్రియుడ్నే భర్తగా పరిచయం చేసి ఇల్లు అద్దెకు తీసుకున్న కిలాడి..అతడితో శృంగారంలో పాల్గొంది. జూబ్లీహిల్స్ రహ్మత్ నగర్ లోని యాదగిరినగర్ లో ఈ ఘటన జరిగింది.
ఇక వివరాల్లోకి వెళితే.. యాదగిరినగర్ లో అద్దె ఇంట్లో ప్రియుడితో రాసలీలలు మొదలు పెట్టింది.సైనికుడి భర్తతో ఇద్దరు పిల్లలు కలిగాక…పర పురుషుడి మోజులో ఆర్మీ జవాన్ భార్య పడింది. అయితే… అకస్మాత్తుగా ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ మధుసూధన్.. ఇంట్లో తన భార్య పరాయి పురుషుడితో శృంగార కార్యకలాపాలను చూశాడు.
భార్యతో పాటు..ఆమె ప్రియుడు జ్ఞానేశ్వర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆర్మీ జవాన్.. ప్రియుడితో ఉన్న భార్యను ఇంట్లోనే ఉంచి..బయటి నుంచి గడియకు తాళం వేశారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సైనికుడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
అయితే.. ఇాలాంటి ఘటనే భీమడోలులో చోటుచేసుకుంది. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో మార్చి 3 న జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించిన పోలీసులు ఖంగుతిన్నారు. ప్రియుడితో కలిసి భార్యే ఈ హత్య చేసినట్లు నిర్ధారించి వారిని అదుపులో తీసుకున్నారు.