Medak: అమ్మ ప్రేమ ఈ భూమిపై వెలకట్టలేనిది. తల్లి తన పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. ఆమె వారిపై ఓ కన్నేసి ఉంచుతుంది మరియు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ తప్పుగా ప్రవర్తిస్తే తల్లికి కోపం వస్తుంది. కొంతమంది తల్లులు తమ పిల్లలపై శారీరకంగా కూడా దాడి చేస్తారు. రెప్పపాటులో చేసే పనుల వల్ల చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఓ తల్లి తన కన్నబిడ్డలపై రాక్షసత్వాన్ని చూపించింది. పిల్లలు నిద్రలేవడం లేదంటూ వారిపై సల సల కాగే నీటిని పిల్లలపై పోసింది. దీంతో పిల్లలు విలవిల లాడారు.
Read also: Vande Bharat: మెరుగైన ఫీచర్లతో వందేభారత్ బోగీల అప్ గ్రేడ్.. పూర్తయిన కాషాయ కలరింగ్..!
మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలం ఎలుకపల్లిలో ఓ తల్లి తన కన్న బిడ్డలపై చేసిన అమానుష ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసింది. తన బిడ్డలు ఎంత సేపటికి నిద్రలేవడం లేదని ఆగ్రహంతో వారిపై కర్కసత్వాన్ని ప్రదర్శించింది. కన్న బిడ్డలను ఎవరైనా కొట్టినా, పల్లెత్తి మాట అన్నా వారిపై కోపం చూపించి బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవల్సాని తల్లే కాగుతున్న నీటిని వారిపై పోసింది. దీంతో నిద్రిస్తున్న పిల్లలు విలవిలలాడారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒళ్లంతా మంటగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. పిల్లల ఏడుస్తుండటంతో అక్కడే వున్న స్థానికుల పరుగునవచ్చి చూడగా పిల్లలపై వేడినీటి పోయడంతోనే ఏడుస్తున్నారని గమనించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పిల్లలపై తల్లి చేసిన అమానుష ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు. భార్య, భర్తలు గొడవ కారణంగా ఇలా చేసిందా? అనే కోణంతో ఆరా తీస్తున్నారు.
Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీ ?.. జాతకం చెప్పిన వేణుస్వామి..