Anasuya: సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. నిత్యం వారి పెళ్లిళ్లు విడాకుల విషయంలో జోక్యం చేసుకొని ట్రెండ్ లో నిలుస్తున్నారు. ఎంతోమంది నటీనటుల జాతకాలు తెలుసుకుంటూ వారి జాతకాల్లో దోషాలు ఉన్నాయంటూ పూజలు చేస్తూ క్రేజ్ సంపాదిస్తు్న్నారు. ఇటీవలే ప్రభాస్ జాతకం చెప్పి సోషల్ మీడియాలో సంచలనాలకు తెరతీశారు. మళ్లీ ఇప్పుడు యాంకర్ అనసూయ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also:Manipur: జాతీయ రహదారిని దిగ్భంధించిన కుకీ సంఘాలు
అనసూయ భవిష్యత్తు పైన వేణు స్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైయ్యాయి. ఇటీవల యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఏమేరకు ట్రెండింగ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో అనసూయకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతున్నాయి. అనసూయ జాతకం పైన వేణు స్వామి మరొకసారి కొన్ని విషయాలు వెలుగులోకి తెచ్చారు. 2021 తర్వాత అనసూయ జాతకం పూర్తిగా మారిపోయిందని ఆమె లైఫ్ లో డ్రాస్టిక్ ఛేంజ్ వస్తుందని వేణు స్వామి తెలిపారు. ఆమెకు రాబోయే రోజుల్లో తిరుగు ఉండదని చాలాకాలం పాటు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోతుందని చెప్పారు.
Read Also:CM YS Jagan: చంద్రబాబు లాంటి నాయకులు అన్నింటినీ మూసేస్తారు.. సీఎం జగన్ ధ్వజం
అంత పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత ఆమె రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తన అభిప్రాయంగా తెలియజేశారు. ‘వేణు స్వామి చెప్పిన ప్రకారం 2021 తర్వాత అనసూయ క్రేజ్ పెరిగింది.. బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చి వరుసగా మంచి అవకాశాలు అందుకుంటోంది. మరి ఆయన చెప్పిన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం చూడాలి.. ఈ మధ్య కాలంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.’ అంటూ పలువురు అనుసూయ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఆమె ఇటీవల పలు వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు.