Rajendranagar Crime: మన జీవన విధానాలు మారటం వలన అందరి మనస్సులకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందువలననే చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా చిన్న చిన్న కారణాలకు, ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలను మందలించినా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతున్నాయి. ఇది సెల్ ఫోన్ ప్రభావమో లేక సోషల్ మీడియా ప్రభావమో తెలియని పరిస్థితి. చిన్న వయసులో ఆత్మహత్యలకే పాల్పడటం లేక మందలించిన వారిపై ఆగ్రహంతో వారినే చంపడం వంటివి సర్వత్రా భయాందోళనకు దారితీస్తున్నాయి. ఓ మైనర్ బాలుడు తల్లిదండ్రులు మందలించారనే కోపంతో తలపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకుంది.
Read also: MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మైనర్ బాలుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదర్ షాకోట్ లో నివాసం ఉంటుంన్న మైనర్ బాలుడు తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యాడు. క్షణికావేశంలో ఆమైనర్ బాలుడు గదిలోకి వెళ్లి అక్కడే ఉన్న పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆమంటను భరించలేక గట్టిగా కేకలు వేయడంతో.. తల్లిదండ్రులు తలుపులు పగల గొట్టి చూడగా కొడుకు శరీరం అంతా కానిపోయింది. దీంతో తల్లిదండ్రులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. దీంతో కొడుకును చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కన్నకొడుకును ఒక్కదెబ్బకూడా వేయకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నామని, పెరిగి పెద్దవాడై మమ్మల్ని పోషిస్తాడనే ఆశతో ఉంటే చిన్న మాటకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీరుమున్నీరవుతున్నారు. తన కొడుకు దూరమైతే తట్టుకోలేమని, ఎలాగైనా తన కొడుకును బతికించాలని వైద్యులను కోరుకుంటున్నారు. అయితే ఈవిషయం తెలుసుకున్న కాప్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Blast Case: హైదరాబాద్ పేలుళ్ల కేసులో ట్విస్ట్ .. ఉగ్రవాదులకు సహాయం చేసిన వ్యక్తి..!