Rajendranagar Crime: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తున్న తల్లి కూతుర్లపై కారు దూసుకుపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కాలంలో మనిషి చంద్రుడిపై కాలు మోపడమే కాకుండా అక్కడే ఉండేందుకు సిద్ధమవుతున్నాడని కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఆ మూఢనమ్మకాలపై నమ్మకంతో జంతుబలులు, నరబలులు చేస్తారు. తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
రాజేంద్ర నగర్‌లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరమైసమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరాడు. అటుగా వస్తున్న ఆటో అంజి బైక్ ను బలంగా ఢీకొట్టిది. కింద పడ్డ అంజి అక్కడికక్కడే మృతి చెందాడు.
మన జీవన విధానాలు మారటం వలన అందరి మనస్సులకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందువలననే చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా చిన్న చిన్న కారణాలకు, ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలను మందలించినా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతున్నాయి.