Dinesh Karthik: లేటు వయస్సులో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు పక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Hails Dinesh Karthik after Heroics In RCB vs SRH Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా వెటరన్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెలరేగుతున్నాడు. లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన డీకే.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.
288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్‌సీబీకి మంచి ఆరంభమే దక్కింది. అయితే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు పుంజుకుని.. వెంటవెంటనే 5 వికెట్స్ తీయడంతో ఆర్‌సీబీ వెనకపడిపోయింది. ఈ సమయంలో దినేష్ కార్తీక్ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. డీకేకు ఎలా బౌలింగ్‌లో చేయాలో ఆర్ధం కాక సన్‌రైజర్స్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమ్మిన్స్ లాంటి సీనియర్ బౌలర్లకు కూడా డీకే చుక్కలు చూపించాడు. డీకే ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్‌సీబీ స్వల్ప తేడాతో ఓడిపోయింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Travis Head: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్!
ఐపీఎల్ 2024లో దినేష్ కార్తీక్ అద్బుతంగా రాణిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివరలో బ్యాటింగ్ వచ్చి తుపాన్ ఇన్నింగ్స్‌లు ఆడేస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో చెలరేగిన డీకేపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘డీకే సూపర్ ఇన్నింగ్స్ ఆడావ్’, ‘లేటు వయస్సులో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు’, ‘టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో డీకేకు చోటు పక్కా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2022కు ముందు కూడా డీకే ఇలానే ఆడి.. మెగా టోర్నీలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!