Musheerabad PS: మనలో చాలామంది కాస్లీ వస్తువులు, బంగారం ధరించడానికి ఇష్టపడతారు. అవి ఒక్కోసారి దొంగతనాలకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. విలువైన వస్తులు పోయాయని, కష్టపడి సంపాదించామని దాన్ని ఎలాగైన తీసుకురావాలని కోరుతుంటారు. ఇక్కడ పోయింది కాస్లీ వస్తువు కాదు అంతకన్నా విలువైనది అది ఏంటనే కదా.. తను రెండేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మేకపిల్ల. మేకపిల్ల పోయిందని పోలీస్టేషన్ కు వెళ్లింది ఓ మహిళన. తన మేకపిల్లను రెండు సంవత్సరాలుగా అల్లారుముద్దుగా పెంచుకున్నానని వాపోయింది. అంతేకాదండోయ్ త్వరాలోనే పట్టుకుని తనకు అప్పగించాలని పోలీస్టేషన్ లో బోరున ఏడ్చేసింది. ఇంక చేసేది ఏమీలేక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలో ఓ మహిళ నివాసం ఉంటుంది. తనతో పాటు ఓ చిన్న మేకపిల్లను తన ఇంట్లో పెంచుకుంటోంది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు తనతోనే వున్న మేకపిల్ల సాయంత్రం కనిపించకుండా పోయింది. దీంతో ఆమె అక్కడ పరిసర ప్రాంతాలు వెతికింది. అయినా మేకపిల్ల జాడ కనపడలేదు. రాత్రంతా మేకపిల్లకోసం వెతికినా కనిపించకుండా పోవడంతో పోలీస్టేషన్ కు వెళ్లింది. తమ మేకపిల్లను ఎవరో కిడ్నాప్ చేశారని ముషీరాబాద్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తన మేకపిల్లను త్వరలో పట్టుకుని అప్పగించాలని కోరింది. గత 2 సంవత్సరాలుగా మేకపిల్లను అల్లారుముద్దుగా పెంచుకున్నానని వాపోయింది. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అయితే ఇంటి ఆవరణలో ఉన్న మేకపిల్లను ఎవరు తీసుకుని వెళ్లింటారనేదానిపై ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులుగా ప్లాన్ వేసి మేకపిల్లను ఎత్తుకుని పోయింటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ పనిచేశారా? లేక ఎవరైనా కావాలనే మేక పిల్లను ఎత్తుకెళ్లారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Sravanamasam : శ్రావణమాసంలో ఇలాంటి గాజులను ఎందుకు వేసుకోవాలో తెలుసా?