మన దేశంలో భక్తులు ఎక్కువ.. వీధికి ఒక గుడి ఉంటుంది.. సంప్రదాయాలు పాటిస్తారు..అయితే పండగల సమయంలో వేరే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా సొంత గ్రామాలకు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో పండగలను చేసుకుంటారు.. అందులో శ్రావణమాసం అయితే చెప్పనక్కలేదు..అమ్మవారిని ఆరాధించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..
ఈ మాసం ఆగష్టు 17 నుంచి మోదలై వచ్చే నెల 15 వరకు ఉంటుంది.. అయితే ఈనెల లో ఆకుపచ్చ గాజులను, ఆకుపచ్చ వస్తువులను వేసుకోవడం వల్ల అమ్మవారు సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది.. అందుకే పచ్చని వస్తువులను కనుక మీ దగ్గర ఉంచుకుంటే బుధ గ్రహం సంతోష పడుతుందని చెబుతున్నారు.పండితులు చెప్పిన దాని ప్రకారం పచ్చని ప్రకృతికి ప్రతికాగా శ్రావణమాసంలో పచ్చని గాజులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది.
ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవడం వల్ల వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పై ఉంటుంది.. ఈ రంగు గాజులు దరిస్తే ప్రశాంతత, ఇక ఈ గాజులు వేసుకొని శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మీపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.. ఇక ఈ మాసంలో వీటిని వేసుకొని పూజలు చేస్తే దేవతలు ప్రసన్నం అవుతారు.. ఇకపోతే ముత్తైదువులకి గాజులు వాయినం గా కూడా ఇస్తూ ఉంటారు.. దేవుళ్ళకు ఈ రంగు అంటే చాలా ఇష్టం.. అదన్నమాట.. ఇక ఎప్పుడు పూజలు చేసిన ఈ రంగు గాజులు వేసుకోవడం మంచిది..