భారీవర్షాలతో పురాతన కాలం నాడు నిర్మించిన భవనాలు (School Building) శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కూలిపోతున్నాయి. అందులో నిర్వహించే పాఠశాలలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో 90 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రస్తుతం కూలిపోతోంది. అప్పటి మహారాష్ట్రలో భైంసా ప్రాంతం ఉండడంతో 1932లో ఈ బిల్డింగ్ నిర్మించారు. రాష్ట్రాల విభజనలో భాగంగా భైంసా ప్రాంతం తెలంగాణలో కలిసింది. నాటి నుంచి నేటి వరకు ఆ స్కూల్ భవనం సరైన సౌకర్యాలు కల్పించలేదు.
MP Ram Mohan Naidu: అటు హర్భజన్.. ఇటు గంభీర్.. మధ్యలో టీడీపీ ఎంపీ
పలుమార్లు స్కూల్ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు టీచర్లు కోరినా నేతలు, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. దాదాపు 400 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైస్కూల్ బిల్డింగ్ పెచ్చులూడి కింద పడుతున్నాయి. నిన్న ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. 5 గదులలో 3 మీడియాలను ఒకే చోట కూర్చో బెట్టి బోధిస్తున్నారు ఉపాధ్యాయులు.
మరోవైపు నిర్మల్ జిల్లా బాసర మండలం సాలపూర్ గ్రామంలో అధిక వర్షాల కారణంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు గ్రహించి పాఠశాలకు వెళ్లి బకెట్ల సహాయంతో నీటిని బయటకు పంపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరద నుండి కాపాడాలని కోరుతున్నారు విద్యార్థులు. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ నుంచి పాఠశాలను తరలించాలని, లేదంటే భారీ ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Konda Vishweshwar Reddy :కొండా చేరికతో బీజేపీలో కొందరు నేతల ఆశలు గల్లంతు అయ్యాయా?