మేడారం భక్తులకి శుభవార్త

మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ… ఇవాళ్టి నుంచి మేడారం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది ఆర్టీసీ… హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతీ రోజు అందుబాటులో ఉండనున్నాయి.. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.. ఇక, దీనికి చార్జీలను కూడా ఫిక్స్‌ చేసింది ఆర్టీసీ.. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు విజయభాస్కర్ వెల్లడించారు..

Read Also: తెలంగాణ మంత్రికి కరోనా

Related Articles

Latest Articles