వరుసగా పెరిగిపోతోన్న కరోనా కేసులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా లాక్‌డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం… అయితే, ప్రజలకు కూరగాయాలు, ఇతర నిత్యావసరాలకు ఇబ్బందిలేకుండా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు కల్పించింది.. కానీ, ఆ నాలుగు గంటలే ఇప్పుడు యమ డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. ఎందుకంటే.. మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడా.. భౌతిక దూరం పాటించడంలేదని.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా.. ఎగబడి మరి కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు కొనుగోలు చేయడమే దీనికి కారణంగా హెచ్చరిస్తున్నారు.
మరోవైపు.. లాక్‌డౌన్ సమయంలో.. కొన్ని రంగాలకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. కానీ, సడలింపుల సమయం ముగిసినా.. రోడ్లపై రద్దీ కనబడుతోంది.. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా.. ఎక్కువ మంది పనిఉన్నా లేకపోయినా..? రోడ్లపైకి రావడమే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు పోలీసులు.. ఓవైపు కోవిడ్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వాటిని పెడచెవిన పెడుతూ భారీ సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. ఇక, ఉదయం ఆ నాలుగు గంటలు అయితే.. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది… ఇదే పరిస్థితి కొనసాగితే… మార్కెట్లు.. కోవిడ్ హాట్‌స్పాట్లుగా మారతాయని.. మార్కెట్లకు వెళ్లేవారే.. వైరస్ వ్యాప్తికి కారణం అవుతారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.