జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ లలో నుండి యువత ముందుకు వచ్చి బీజేపీ లో చేరడం హర్షణీయం అన్నారు హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు. యూసుఫ్ గూడ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన సమక్షంలో 300 మందికి పైగా యువతీ యువకులను ఆయన బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధాన మంత్రి గా చూడాలని యువత బలంగా కోరుకుంటున్నట్లు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా సమస్యలను పట్టించుకోవట్లేదని, పోలీస్ వ్యవస్థ ను పెట్టుకొని దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నారని,అన్ని డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ అతలాకుతలం అయ్యాయని, జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ చేరికలు అందుకు సాక్ష్యంగా నిలుస్తాయని అన్నారు.
Also Read : Hyderabad: తండ్రి మందలించాడు.. గాజు పెంకుతో గొంతు కోసిన కూతురు
బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పద్మ వీరపనేని మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్దాంతాలకు మెచ్చి అన్ని డివిజన్ లలోని యువతీ యువకులు పార్టీ లో చేరారని,గత తొమ్మిది సంవత్సరాలనుండి బి ఆర్ ఎస్ పరిపాలనలో జూబ్లీహిల్స్ సమస్యలు ఎక్కడికక్కడ గాలికి వదిలేశారని,పేదల గోడు పట్టించుకునే నాధుడు లేడని, పెన్షన్ లు రాకపోయిన, వరదలతో రోడ్లు అద్వాన్నంగా ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం వల్ల ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు.చిన్న చిన్న సమస్యలు తీర్చడంలో సైతం ప్రభుత్వం విఫలమైందన్నారు. డబులు బెడ్ రూమ్, డంప్ యార్డ్ వంటి అనేక సమస్యలపై పోరాడ గలిగే శక్తి ఒక్క బీజేపీ కి మాత్రమే ఉందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల మాదిరిగానే రానున్న ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని అందుకు తార్కాణమే ఈ చేరికలు అన్నారు.ఈ సందర్బంగా పాటి వెంకటేశ్వరరావు,త్రిమూర్తులు,సయ్యద్ ఫైజల్, బుజ్జిబాబు,సురేష్, శ్రీనివాస్ రాజ్,మహేష్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు బీజేపీ లో చేరారు.
Also Read : PMSBY: కేవలం రూ.20లకే రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకత తెలుసుకోండి